విండీస్ ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా క్రిస్‌గేల్ నియమితులయ్యాడు. జాసన్ హోల్డర్ సారథ్యంలోని ప్రపంచకప్ జట్టులో ఈ 39 ఏళ్ల ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న గేల్.. ఈ అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
‘వెస్టిండీస్ తరఫున ఏ ఫార్మాట్‌కైనా ప్రతినిధ్యం వహించడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తాను.. ముఖ్యంగా ప్రపంచకప్ నాకు ఎంతో ప్రత్యేకం. ఓ సీనియర్ ఆటగాడిగా జట్టులో కెప్టెన్‌తోపాటు ఇతర ఆటగాళ్లకు మద్దతు ప్రకటించడం నా బాధ్యత. బహుశా ప్రపంచకప్టోర్నీల్లో ఇదే అతపెద్ద టోర్నీ. అందువల్ల మాపై భారీగా అంచనాలు ఉంటాయి. విండీస్ అభిమానులను సంతృప్తి పరచడానికి మేం బాగా ఆడతాం’ అని గేల్ ధీమా వ్యక్తం చేశాడు. గేల్ ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు తరఫున 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 490 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా విండీస్ మే 31న తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది.
గేల్‌కు సరికొత్త బాధ్యతలు
Related tags :