పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎక్స్టన్‌లో నివసిస్తున్న అకినేపల్లి సంతోష్(27) అనే తెలుగు యువకుడు 13 ఏళ్ల బాలికతో శృంగారానికి ప్రయత్నించిన కారణంగా పెన్సిల్వేనియాలోని ఎక్స్టన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు మఫ్టీలో ఏర్పాటు చేసిన వలలో ఇతడు చిక్కుకున్నాడు. మఫ్టీలోని పోలీసులు తాను 13ఏళ్ల బాలికనని పదే పదే చెప్పినప్పటికీ సంతోష్ వినకుండా శృంగారానికి సమ్మతించిన కారణంగా ఏప్రిల్ 13న అతడిని మాటు వేసి అదుపులోనికి తీసుకున్నారు. 50వేల డాలర్లను బెయిలు సొమ్ముగా నిర్ణయించారు. ఈ కేసు వాదోపవాదాలు మే 13న జరగనున్నాయి.
13ఏళ్ల బాలికతో శృంగారానికి ప్రయత్నం…
Related tags :