DailyDose

పండు సందీప్ గ్యాంగ్‌ల నగర బహిష్కరణ-నేరవార్తలు

పండు సందీప్ గ్యాంగ్‌ల నగర బహిష్కరణ-నేరవార్తలు

* విశాఖలో తెలుగుదేశం ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయుల దాడి చేశారు. ఓ శంకుస్థాపనకు వచ్చిన ఆయనపై రాళ్ల వర్షం కురిపించారు.ఈ ఘటనలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు.వైకాపా తీరుకు నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.

* సీబీఐ అధికారులమంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో సూత్రధారులుగా తమిళనటి లీనా మరియా పాల్‌ (మద్రాస్‌ కేఫ్‌ ఫేమ్‌), ఆమె భర్త సుఖేష్‌ చంద్రశేఖర్‌లను సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన మణివర్ధన్‌రెడ్డి, తమిళనాడులోని మదురైకి చెందిన సెల్వ రామరాజ్‌లను అరెస్టు చేశారు.

* సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణానికి సంబంధించిన ప్రాథ‌మిక పోస్టుమార్ట‌మ్ నివేదిక‌ను రిలీజ్ చేశారు.ఉరి వేసుకోవ‌డం వ‌ల్ల శ్వాస ఆడ‌లేద‌ని ఆ రిపోర్ట్‌లో తేలింది.బాంద్రాలోని త‌న ఇంట్లో సుశాంత్ ఉరి వేసుకుని చ‌నిపోయాడు. ఇంట్లో ప‌నిచేస్తున్న వ్య‌క్తి.. అత‌న్ని గుర్తించాడు. సుశాంత్ మ‌ర‌ణాన్ని ఆత్మ‌హ‌త్య‌గా పోలీసులు చిత్రీక‌రిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన సూసైడ్ నోట్ దొర‌క‌లేదు. 

* పశ్చిమ గోదావరి జిల్లా.పెరవలి జంక్షన్ విజిలెన్స్ ఎస్పి వరదరాజులు ఆదేశాలతో పెరవలి జంక్షన్ వద్ద పీడీఎస్ బియ్యం ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.

* ప.గో. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి బ్రాందీ షాప్ లో చోరీ. షాప్ వెనుక కన్నం పెట్టి దొంగతనానికి పాల్బడిన దుండగులు.

* వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన మూడు పిటిషన్లపై వచ్చే వారాంతానికి విచారణ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్లాంట్ లోకి వెళ్లేందుకు, ప్లాంట్ లోని మెటీరియల్ ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతులు కోరుతూ ఎల్జీ పాలిమర్స్ కొన్నిరోజుల కిందట హైకోర్టును ఆశ్రయించింది. వీటిపై సత్వరమే విచారణ జరిపి, తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశించింది.అంతేగాకుండా, గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించే అధికారం ఎన్జీటీకి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పర్యావరణానికి ముడిపడి ఉన్న ఏ అంశంలోనైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్పందించేందుకు ఎన్జీటీకి అధికారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక, అధికారులు స్వాధీనం చేసుకున్న తమ సంస్థ డైరెక్టర్ల పాస్ పోర్టులు తిరిగి పొందేందుకు ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

* విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం లో కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.

* గ్యాంగ్ వార్ కేసు.. సందీప్, పండు గ్యాంగుల నగర బహిష్కరణ. నగర పోలీసుల కీలక నిర్ణయం. గొడవకు కారణమైన బిల్డర్లు అరెస్ట్ఈ కేసులో ఇప్పటి వరకు 37 మంది అరెస్ట్పరారీలో ఉన్న 13 మంది కోసం పోలీసుల గాలింపుఈ రెండు గ్యాంగులను నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ నిన్న ఆదేశాలు జారీఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని ఆదేశంఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్పండు, సందీప్ గ్యాంగుల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులువీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నా పోలీసులునిన్న అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డిలను నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.