Agriculture

తెలంగాణా ధాన్యం రికార్డు

తెలంగాణా ధాన్యం రికార్డు

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. సరికొత్త రికార్డు నెలకొల్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడేమో కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి, పట్టుదల, ముందుచూపు వల్లే ఇది సాధ్యమైంది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించబోతోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.