అంజలి ( జననం 1986 జూన్ 16). తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి, మోడల్. అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో జూన్ 16, 1986లో జన్మించింది. మ్యాథ్స్‌లో డిగ్రీ చేస్తూనే షార్ట్ఫిల్మ్స్లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన ‘డేర్’. తర్వాత 2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో ‘ప్రేమలేఖ రాశా’.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన ‘షాపింగ్‌మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ ‘జర్నీ’లో అవకాశం ఇచ్చారు. 2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది. 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు. తర్వాత ‘బలుపు’ సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది.
తెలుగునాట జన్మించి…తమిళంలో మెరిసి…
Related tags :