* పెరిగిన బంగారం ధరలు,,ఎగసిన వెండి ధరలు!బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 17) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి.మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.హైదరాబాద్ లో బంగారం ధరలు..హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి.బుధవారం (17.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 210 రూపాయలు పెరిగింది. దీంతో 45,530 రూపాయల వద్ద నిలిచింది.ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,670 రూపాయల వద్ద నిలిచింది.వెండి ధరలు..బంగారం ధరలతో పాటు, వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది.దీంతో 47వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 47,700 రూపాయలకు చేరుకుంది.విజయవాడ, విశాఖపట్నంలలో..ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 210 రూపాయలు పెరిగింది. దీంతో 45,530 రూపాయల వద్ద నిలిచింది.ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,670 రూపాయల వద్ద నిలిచింది.దేశరాజధాని ఢిల్లీ లో..ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర 46,000 రూపాయల వద్ద నిలిచింది.ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 47,200రూపాయలుగా నమోదు అయింది.ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది.దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు ఎగసి 47,700 రూపాయలుగా నమోదు అయింది.ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును.ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
* దేశంలో 11వ రోజు చమురు ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్ లీటర్ ధర 55 పైసలు, డీజిల్ 69 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
* గూగుల్‌కు చెందిన డ్యుయో చాట్ అప్లికేషన్‌లో మార్పులు చేసింది. వీడియో కాలింగ్ సౌకర్యాన్ని ఒక గ్రూపులో 12 నుంచి 32 మందికి పెంచింది. ఎక్కువ మంది గ్రూప్‌లో కలిసి ఉంటే భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుంది అని పేర్కొంది.
* భారత్ – చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీనికి తోడు దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడం స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో సెన్సెక్స్ 97 పాయింట్ల కోల్పోయి 33,508 వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 9,881 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం ఆద్యంతం ఊగిసలాటలో పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో కోలుకున్నప్పటికీ చివరికి నష్టాల్లో ముగిసింది.