నటి వనితా విజయకుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన వనిత ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కాగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.ఆ తరువాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది. కాగా నృత్య దర్శకుడు రాబర్ట్‌తో వనిత కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కాగా ఇటీవల బిగ్‌బాస్–3లో పాల్గొని వార్తల్లోకి ఎక్కిన వనిత తాజాగా మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే సింపుల్గా పీటర్ పాల్ అనే వ్యక్తితో వనిత వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సహా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం గురించి నటి వనిత తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
మూడోసారి పెళ్లి
Related tags :