“తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో “నాన్నా – నీకు నమస్కారం” అంటూ జూన్ 21, 2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలను దృశ్య సమావేశంలో జరుపుతున్నామని, ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ళ భరణి హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డాక్టర్.ప్రసాద్ తోటకూరలు తెలిపారు.
“ఘనుడు నాన్న – త్యాగధనుడు నాన్న” అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన 750 కవితల నుండి విజేతలను ఎంపిక చేశారు. జూన్ 21న వీరికి బహుమతి ప్రదానం, కవితాగానం ఉంటుందని సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు.
*** విజేతలు:
ప్రథమ బహుమతి: మౌనశ్రీ మల్లిక్ (హైదరాబాద్)
ద్వితీయ బహుమతి: జయశ్రీ మువ్వా (ఖమ్మం)
తృతీయ బహుమతి: ప్రొఫెసర్. రామ చంద్రమౌళి (వరంగల్)
*** ప్రత్యేక ప్రోత్సాహకాలు:
1.రాపోలు సీతారామరాజు (సౌత్ ఆఫ్రికా) 2. అల్లాల రత్నాకర్ (బెహ్రయిన్ ) 3. డి. దివ్య ప్రశాంత్ (ఆస్ట్రేలియా) 4. పంతుల కృష్ణమూర్తి (ఒమెన్) 5. డా. నక్త వెంకట మనోహర రాజు (యూ ఎస్ ఏ) 6. డా. వడ్డేపల్లి కృష్ణ (హైదరాబాద్) 7. సి. యమున (హైదరాబాద్) 8. సిరాశ్రీ (హైదరాబాద్) 9. మధురాంతకం మంజుల (తమిళనాడు) 10. పుష్పలత (బెంగుళూరు) 11. జె.కె. భారవి (హైదరాబాద్) 12. సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు (అశ్వారావుపేట) 13. డా. అడిగొప్పుల శేషు (భద్రాది జిల్లా) 14. చలపాక ప్రకాష్ (విజయవాడ) 15. రమాదేవి కులకర్ణి (హైదరాబాద్) 16. డా. మనోహరరావు ఉమా గాంధీ (విశాఖపట్నం) 17. చంద్రకళ యలమర్తి (యూ ఎస్ ఏ) 18. పుప్పాల కృష్ణచంద్ర మౌళి (ఒరిస్సా) 19. డా. ఎం. సి. దాస్ (విజయవాడ) 20. బండారి రాజ్ కుమార్ (వరంగల్) 21. గూటం స్వామి (రాజామహేంద్రవరం) 22. గట్టు రాధామోహన్ (హనుమకొండ) 23. బోడ కూర్మారావు (విశాఖపట్నం)
ఈ పితృదినోత్సవ వేడుకలు అంతర్జాతీయ దృశ్య సమావేశం ఆదివారం, జూన్ 21, 2020 న (అమెరికా CDT 11:00 am, ఇండియా 9:30 pm) జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వెన్నం ఫౌండేషన్ సహకారం అందజేస్తోంది.