ScienceAndTech

ఈ సెల్ఫీ యాప్స్ అర్జంటుగా డిలీట్ చేయండి

ఈ సెల్ఫీ యాప్స్ అర్జంటుగా డిలీట్ చేయండి

ఈ 30 యాప్స్‌ని బ్యాన్ చేసిన గూగుల్… మీరూ వెంటనే డిలిట్ చేయండి.

అనవసరమైన యాడ్స్‌తో యూజర్లకు చికాకు పుట్టిస్తున్న 30 యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఈ యాప్స్ అన్నీ యూజర్లకు అవసరం లేని యాడ్స్ చూపిస్తున్నాయి.

అంతేకాదు… యూజర్ల ప్రమేయం లేకుండా లింక్స్ క్లిక్ చేసి ఇతర వెబ్‌సైట్లకు తీసుకెళ్తున్నాయి. దీంతో వీటిని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తీసేసింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ని ఇన్‍స్టాల్ చేసుకున్న యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి వాటిని తొలగించాలని వైట్ ఆప్స్ సెక్యూరిటీ రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. మరి మీరు కూడా ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసినట్టైతే వెంటనే డిలిట్ చేయండి.

Yoroko Camera

Solu Camera

Lite Beauty Camera

Beauty Collage Lite

Beauty & Filters Camera

Photo Collage & Beauty Camera

Beauty Camera Selfie Filter

Gaty Beauty Camera

Pand Selife Beauty Camera

Caoon Photo Editor & Selfie Beauty Camera

Benbu Selife Beauty Camera

Pinut Selife Beauty Camera & Photo Editor

Mood Photo Editor & Selife Beauty Camera

Rose Photo Editor & Selfie Beauty Camera

Selife Beauty Camera & Photo Editor

Fog Selife Beauty Camera

First Selife Beauty Camera & Photo Editor

Vanu Selife Beauty Camera

Sun Pro Beauty Cameraa

Funny Sweet Beauty Camera

Little Bee Beauty Camera

Beauty Camera & Photo Editor Pro

Grass Beauty Camera

Ele Beauty Camera

Flower Beauty Camera

Best Selfie Beauty Camera

Orange Camera

Sunny Beauty Camera

Pro Selfie Beauty Camera

Selfie Beauty Camera Pro

Elegant Beauty Cam-2019

బ్యూటీ, సెల్ఫీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన యాప్స్ ఇవి. 2019 జనవరి నుంచి గూగుల్ యాప్ స్టోర్‌లో ఉన్నాయి. ప్లేస్టోర్‌లోని గూగుల్ సెక్యూరిటీ సర్వీస్ కొన్ని వారాల క్రితం ఈ యాప్స్‌ని గుర్తించింది.