Devotional

ఈ రాశులవారు గ్రహణాన్ని చూడరాదు

ఈ రాశులవారు గ్రహణాన్ని చూడరాదు

పాటించేవారికి మాత్రమే…

జూన్ 21న సూర్యగ్రహణం.. ఏ రాశి వారు చూడకూడదు.. పండితులు చెప్పిన నియమాలు..

ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.

జూన్ 21 ఆదివారం తేదీన అమావాస్, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఇలాంటి గ్రహణాల సమయాల్లో అన్ని ఆలయాలను మూసివేస్తారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం లాంటివి మాత్రం గ్రహణ కాలంలో మరింత ఎక్కువ మంది పూజలు నిర్వహిస్తారు. అయితే, ఈ సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదనే అంశంపై హైందవ సంస్కృతిలో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను చెబుతున్నారు దైవజ్ఞ రత్న , జ్యోతిష రత్న, జ్యోతిష భూషణ్, వాస్తు రత్నగా పేరుపొందిన డా. చిలుకూరి శ్రీనివాస మూర్తి. ఈ సూర్యగ్రహణాన్ని చూడామణి నామక సూర్యగ్రహణం అంటారు.

21-06-2020 ఉదయం 12.08 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం . మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపిస్తుంది.

మృగశిర, ఆరుద్ర, నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.

గ్రహణ ఆరంభకాలం : ఉ.10.25
గ్రహణ మధ్యకాలం : ఉ.12.08
గ్రహణ అంత్యకాలం : మ . 1.54
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 29 నిమిషాలు

గ్రహణ నియమాలు
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు ఉదయం 7 గంటల లోపు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉదయం 8 గంటల లోపు తినవచ్చు. అది కూడా “అల్పాహారాన్ని” మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు మృగశిర, ఆరుద్ర నక్షత్ర జాతకుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణపట్టు విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి, మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్రజపం వారు చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్యగాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి! తన్నో ‘ఆదిత్య’ ప్రచోదయాత్!!*

గ్రహణానంతరం స్నానమునకు, దేవతా విగ్రహాల శుభ్రతకు ప్రత్యేకతలు లేవు యధావిధిగా చేసుకోవడమే.

బియ్యం, గోధుమలు, మినుగులు, అవకాశముంటే వెండి సర్ప ప్రతిమలు 2 మాత్రం దానం.

అమావాస్య కావున బ్రహ్మణేతరులు పెద్దల పేరున స్వయం పాకం ఇవ్వచ్చు.