ఇంట్లోనే కాదు, గుళ్లో కూడా పూజంతా అయ్యాక దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం, దాన్ని మనం కళ్లకు అద్దుకోవడం ఓ సంప్రదాయంగా పాటిస్తాం. ఇలా హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక చింతనే కాదు, శాస్త్రం కూడా ఉంది. శుభప్రదంగా ఇచ్చే హారతిని మంగళహారతి అని అంటారు. కర్పూరం వెలిగించిన కొన్ని క్షణాలకు అది ఉత్పతనం చెందుతుంది. అంటే… ఘనపదార్థం వాయుపదార్థంగా మారుతుంది. ‘కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో అదేవిధంగా మాలోని మలినాలూ లోపాలూ పోగొట్టుకుని మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నా’మని తెలియజేసేందుకే హారతి ఇచ్చి కళ్లకు అద్దుకుంటాం. శాస్త్రపరంగా చెప్పాలంటే… హారతిని గుండ్రంగా తిప్పడం వల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది. దాన్ని కళ్లకు అద్దుకున్నప్పుడు మనకు తెలియకుండానే కర్పూర వాసనను పీలుస్తాం. ఆ వాసన శ్వాస సంబంధ సమస్యల్ని నివారిస్తుందనీ కళ్లకూ చలువ చేస్తుందనీ చెబుతారు. కర్పూర వాసన మనసుకీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుళ్లకు ఎక్కువమంది వస్తారు. దాంతో ఆ పరిసరాల్లో సూక్ష్మక్రిములూ చేరతాయి. హారతి తీసుకోవడం వల్ల ఆ కాలుష్యమూ తగ్గుతుంది.
కర్పూరం పర్యావరణ హితం
Related tags :