Movies

ఇతడే మెగావారి పోలీసు అల్లుడు

ఇతడే మెగావారి పోలీసు అల్లుడు

మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకోబోతున్నారు. గురువారం నిహారిక ఓ వ్యక్తిని హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసి, సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ వ్యక్తి ముఖం మాత్రం చూపించలేదు. శుక్రవారం చైతన్యతో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్‌ చేస్తూ.. ‘అతడు నావాడు..’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు రితూ వర్మ, సుశాంత్‌, నందిని రెడ్డి తదితరులు నటికి శుభాకాంక్షలు చెప్పారు.