మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లుగా ఉన్నట్లు ఆయన వైద్యులకు తెలియజేశారు. దీంతో నిపుణులు పరీక్షించి అవసరమైన మందులు సిఫార్సు చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో ఈనెల 17న ఆయనకు తిరిగి శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గుంటూరులోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
అచ్చెన్నకు బీపీ పెరిగింది
Related tags :