లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ నిధి
రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాబార్డు ఛైర్మన్గా నియమితులైన తెలుగు వ్యక్తి చింతల గోవిందరాజులు.
మొత్తం 2.50 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తున్నట్లు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు
కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే రుణాల్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని బ్యాంకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.