NRI-NRT

డీసీ నుండి ఇండియాలో దిగనున్న 224మంది ప్రవాసులు

డీసీ నుండి ఇండియాలో దిగనున్న 224మంది ప్రవాసులు

వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు.

వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి కొద్ది గంటల క్రితం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది.

ఈ విమానంలో పసిపిల్లలు కూడా ప్రయాణం చేస్తున్నట్టు ఇండియన్ ఎంబసి పేర్కొంది.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ మిషన్‌లో రెండు విడతలు పూర్తికాగా.. ప్రస్తుతం మూడో విడత నడుస్తోంది.

జూన్ 10న మొదలైన మూడో విడత జూన్ 30 వరకు కొనసాగనుంది.

ఈ విడతలో మొత్తంగా 550 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు తమ మాతృభూమికి చేరుకోనున్నారు.

కాగా.. ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న దాదాపు లక్షా 25 వేల మంది భారతీయులను ఈ మిషన్ కింద తీసుకొచ్చినట్టు మంగళవారం విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.

మంగళవారం ఒక్కరోజే 6,037 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు.