కేదార్‌నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభం. ఉత్తరాఖండ్ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో గురువారం ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల తర్వాత కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. దీంతో కేదార్‌నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు తలుపులను తెరుస్తారు. భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. మరోవైపు బద్రీనాథ్ ఆలయం శుక్రవారం నుంచి తెరుచుకోనుంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేదార్‌నాథ్ దర్శనాలు ప్రారంభం
Related tags :