అమెరికాలోని భారత ఎంబసీ సంయుక్త సహకారంతో భారత్-అమెరికా సహకార సమాఖ్య(USISM) సంస్థ నిర్వహించిన ప్రైవేట్ విమానాల్లో డల్లాస్, చికాగో, న్యూయార్క్ నగరాల నుండి భారత్‌కు ప్రవాసులు విజయవంతంగా చేరుకున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏయిర్ ఇండియా విమానాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కరోనా కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన ప్రవాసులకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేట్ సేవలకు శ్రీకారం చుట్టినట్లు USISM ప్రతినిధి పులి రవి తెలిపారు. తమ సంస్థ ప్రతినిధులు ప్రయాణీకుల భద్రత, కరోనా నివారణ వంటి అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 24వ తేదీ సాయంకాలం బయల్దేరిన ఈ విమానాలు 18గంటల పాటు విజయవంతంగా ప్రయాణించి 250 మందికి పైగా ప్రవాసులను భారత్‌లో వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు రవి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు USISM.ORG వెబ్‌సైట్ చూడవల్సిందిగా ఆయన కోరారు.
ప్రవాసులను విజయవంతంగా భారత్ చేర్చిన USISM విమానాలు
Related tags :