Health

ఆయుర్వేదంలో సామెతలు

ఆయుర్వేదంలో సామెతలు

సామెతల్లో ఆయుర్వేదం!
.
“తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు” ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! …ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే “అశ్వగంధ” పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
“ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల” …ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని …సామెత ఏమంటే ….”కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు ”
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట …సామెత ఇలా …”పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు”…”ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు “…
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది …సామెత …ఇలా …”ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది ”
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి …శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే …”మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి “..అని సామెత
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో …”పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది “….”ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి ”
.
అలానే …శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత …”కక్కిన బిడ్డ దక్కుతుంది ” అని…
.
ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!
జాతి జీవనాడి నశిస్తుంది!