Sports

ధోనీని ఏమనొద్దు

Parthiv Patel Speaks Of His Career On Dhoni

తన కెరీర్‌ అర్ధాంతరంగా ఆగిపోడానికి మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ జట్టులోకి రావడమేననే విమర్శలను తప్పుబట్టాడు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌. 17 ఏళ్ల వయసులోనే టీమ్‌ఇండియాకు ఎంపికైన అతడు తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలోకి దినేశ్‌ కార్తిక్‌, ధోనీ వచ్చారు. కార్తిక్‌ పెద్దగా రాణించకపోవడంతో మహీ జట్టులోకి వచ్చిన రెండేళ్లలోనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలా బాధ్యతాయుతమైన సారథిగా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌కీపర్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ జట్టును ముందుండి నడిపించాడు. అయితే, ధోనీ రాకతో పార్థివ్‌పటేల్‌, దినేశ్‌ కార్తిక్‌ల కెరీర్లకు తెరపడిందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తారు. అలాంటి మాటలను తాను నమ్మనని వెటరన్‌ క్రికెటర్‌ అంటున్నాడు. ఆదివారం ఆకాశ్‌చోప్రాతో యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన పార్థివ్‌ తన కెరీర్‌పై స్పందించాడు.