తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ అమర్ రాజా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కు గత ప్రభుత్వం కేటాయించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, నునిండ్లపల్లి, కొత్తపల్లిలో ఈ భూములను కేటాయించించింది. అయితే, ఆ భూమిలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో… వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై గల్లా జయదేవ్ ఇంకా స్పందిచాల్సి ఉంది.
253 ఎకరాలు తీసేసుకున్నారు
Related tags :