DailyDose

1088 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన జగన్-తాజావార్తలు

1088 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన జగన్-తాజావార్తలు

* జాతీయ వైద్యుల దినోత్సవం రోజు ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముంఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీటర్‌ వేదికగా ఆయన జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

* ‘‘కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి’’ తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

* ‘‘కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి’’ తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

* ఎమ్మెల్సీ పదవికి వైకాపా నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ‌ రాజీనామా చేశారు. గత నెల 19న జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం మండలి ఛైర్మన్‌ ఆమోదించారు. దీంతోపాటు మంత్రిపదవులకు కూడా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి రాజీనామా చేశారు.

* రాష్ట్రంలో సిమెంట్‌ సరఫరా కోసం ప్రభుత్వం ఓ యాప్‌ను సిద్ధం చేసింది. వైఎస్‌ నిర్మాణ్‌ పేరుతో రూపొందించిన ఆ మొబైల్‌ యాప్‌ను మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రారంభించారు. మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. వైఎస్‌ నిర్మాణ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారానే ఇకపై సిమెంట్‌ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. సకాలంలో వినియోగదారులకు సిమెంట్‌ పంపిణీ చేసేలా ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు.

* యాంటీ వైరల్‌ ఔషధం రెమిడెసివిర్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గిలిద్ సైన్సెస్‌ స్టాక్‌నంతా అమెరికా కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని యూఎస్‌ ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్‌హెచ్‌ఎస్‌) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఏకైక తయారీ సంస్థ గిలిద్ సైన్సెస్‌ నుంచి 5లక్షల డోసులను తమ దేశం కొనుగోలు చేసిందని దానిలో పేర్కొంది.

* తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలు, రొయ్యల చెరువులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. రాజోలు, అంతర్వేది సహా వివిధ ప్రాంతాల్లో సముద్ర ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని ఏనుమోలు వెంకటపతిరాజు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 7, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 39 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 611 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి.

* దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు స‌మూహాలుగా ఏర్ప‌డ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. ఇలాంటి సూచ‌న‌ల‌ను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభ‌కార్యం చివ‌ర‌కు విషాదాంతమైన ఘ‌ట‌న బిహార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు మ‌ర‌ణించ‌డంతోపాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 110మందికిపైగా బంధువులకు క‌రోనా వైర‌స్‌ సోకింది.

* తెలంగాణలో డిగ్రీ, ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన దోస్త్‌ రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత కారణంగా దోస్త్‌ ప్రక్రియ వాయిదా వేసినట్లు కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. దోస్త్‌ ప్రక్రియ తేదీలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

* హాంగ్‌కాంగ్‌ను రెక్కలు విరిచి ఉక్కు పంజరంలోకి నెట్టింది చైనా. బ్రిటిష్‌ -సైనో ఒప్పందానికి తూట్లుపొడిచింది. ఉద్యమం చేసే.. ‘విదేశీ శక్తి’ పేరుతో కటకటాల్లోకి పంపించే జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో 23 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం అనుభవిస్తున్న హాంగ్‌కాంగ్‌ మెల్లగా చైనా కమ్యూనిస్టు పార్టీ గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఈ కొత్త చట్టం ప్రకారం వేర్పాటు వాదం, ఉగ్రవాదానికి జీవితం కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అని వాడుతున్నారని ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్ అనే పదాన్ని ఇతర పార్టీ పేర్లలో వాడకుండా చూడాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. వైఎస్సార్ అనే పదంతో రిజిస్ట్రీ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని మహూబ్‌ బాషా తెలిపారు.

* ఎమ్మెల్సీ పదవికి వైకాపా నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ‌ రాజీనామా చేశారు. గత నెల 19న జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం తమ రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం మండలి ఛైర్మన్‌ ఆమోదించారు. దీంతోపాటు మంత్రిపదవులకు కూడా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు.