కథానాయికలకు అన్నింటికంటే ముఖ్యమైంది అందం…ఫిట్‌నెస్. ఈ రెండింటి కోసం నాయికలు నానా తంటాలు పడుతుంటారు. ఎవరిశైలిలో వాళ్లు అందానికి మెరుగులు దిద్దుకుంటూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. బాలీవుడ్ అందాల నాయిక నర్గీస్ ఫక్రీ ఒంటి నిండా ఎర్రమట్టి రాసుకొని ఎండలో నిల్చుంది. గులాబీ రంగు బికినీ ధరించి ఒంటి నిండా ఎర్రమట్టితో నిల్చున్న ఆమె అందం సూర్యకాంతి తగిలి రెట్టింపైంది. మడ్‌బాత్ చేస్తూ పులకించిపోయిన నర్గీస్ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ‘‘జీవితంతో పాటు శరీరంలోని మలినాలను ఇలా ఒక్కోసారి బయటకు పంపే పనిచేస్తుండాలి. అప్పుడే కొత్త అందంతో మెరుస్తాం. ఎర్రమట్టి స్నానం శరీరంలోని మలినాలను తొలిగించడమే కాదు…కొత్త సాంత్వన ఇస్తుంది. మట్టి పూసుకొని ఎండలో నిల్చోవడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది’’ అంటూ పోస్ట్ చేసింది.
మట్టితో మలినం మాయం
Related tags :