Kids

చిన్నారులకు మనోనియంత్రణ నేర్పాలి

Teach Mind Control To Kids - TNILIVE Telugu Kids Info

1. మనం చేసిన పని మంచా .. చెడా అని జడ్జి చేసే అధికారం ఇరువురికి మాత్రమే వుంది. నా మనసు మరియు సభ్య సమాజం.

2. మనసు చంచలమైనది .. బలహీనమైనది. చెడుకు ఇట్టే లొంగి పోతుంది. తప్పు చేయటానికి ఆ పరిస్థితుల రీత్యా వెనుకాడక ; అదే కరెట్టు అని గోతిలో దింపేస్తుంది….

3. మరి అప్పుడు సభ్య సమాజం అంటే నలుగురు నాలుగు రకాలుగా నా గురించి మాట్లాడుకుంటూ వుంటారే… అది విని విశ్లేషించుకొనే …. గట్స్ కలిగిన వాడే మొనగాడు. జీవితంలో తప్పు చేయడు.

4. మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అనే దానికి ప్రత్యేక యార్డ్స్టిక్ లేదు. సత్పురుషుల బృందం అంటే వారలు జీవితంలో ఎన్నో చవి చూచి వుంటారు కాబట్టి …. వారు ఏది చెపితే అదే మంచి..ధర్మం….

5. అంతే గాని వితండ వాదం చేసి; అందరి రూట్ లో నేనేందుకు వెళ్లాలి ; నా రూటే వేరు… అనుకుంటే… జీవితంలో నిలబడటానికి ఊతమైన ఆ వేర్లు కుళ్ళిపోయి ; కుప్పకూలే పరిస్థితి నేను చేజెతులారా చేసుకునేదే కదా….

ఇంతకన్నా ఎక్కువ చెపితే…. చదువరులు విసుక్కుంటారేమో…