Movies

ఈ ఏడాదిలోనే నెం.7

2020 MI7 Tom Cruise New Updates

టామ్‌ క్రూజ్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’. కరోనా వైరస్‌ కారణంగా సినిమా షూటింగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభించాలని చిత్రనిర్మాణ సంస్థ యోచిస్తుంది. చిత్ర నటుడు సైమన్‌ పెగ్‌ (బెంజీ డున్‌ పాత్రలో నటిస్తున్నారు) ఓ పత్రికతో మాట్లాడుతూ..‘‘సినిమా షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు రోజూ సెట్‌కి వచ్చిన తర్వాత పరీక్షలు జరిపించాలి. అలా రోజూ చేయాలి. మరీ ఎలా చేస్తారో లేదో నాకైతే తెలియదు’ అని చెబుతున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. స్కైడ్యాన్స్ మీడియా టీసీ ప్రొడక్ష‍న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో వింగ్ రేమ్స్,రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలే అట్వెల్, హెన్రీ సెర్నీ తదితరులు నటిస్తున్నారు. పారామౌంట్‌ పిక్చర్‌ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.