* 2018-19 స్టాండలోన్, ఏకీకృత ఫలితాలను ఈ నెల 27న బోర్డు సమావేశంలో పరిశీలిస్తామని జీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది.
*కనీస ఆదాయ పథకాలు, రైతు రుణ మాఫీల వంటి ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది.
*టాటా గ్రూపు సంస్థ టైటన్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.348.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*సీపీసీ (క్యాల్సినేటెడ్ పెట్రోలియం కోక్), రసాయనాలు, సిమెంటు తయారీ సంస్థ రెయిన్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి రూ.3196.5 కోట్ల ఆదాయాన్ని, రూ.68.8 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
*జర్మనీకి చెందిన పారిశ్రామిక పరికరాల తయారీ దిగ్గజ సంస్థ సీమెన్స్, 10,000 ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
*సూచీలు వరుసగా ఆరో రోజూ నష్టాల బాటలోనే కొనసాగాయి. అమెరికా-చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతల భయాలు అంతర్జాతీయ మదుపర్ల సెంటిమెంటును దెబ్బ తీశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లనూ తాకింది.
*వడ్డీరేట్లను వచ్చే జూన్‌లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తగ్గించే అవకాశముందని లండన్‌కు చెందిన అంతర్జాతీయ సమాచార సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణ, ద్రవ్యలోటు ఒత్తిళ్లు పెరగకముందే ఈ చర్య తీసుకోవచ్చని పేర్కొంది.
* టెక్ దిగ్గజం గూగుల్ కొత్త తరం స్మార్ట్‌ఫోన్లు- పిక్సెల్ 3ఏ, పిక్సెల్ 3ఏ ఎక్స్‌ఎల్‌లను భారత విపణిలోకి విడుదల చేయనుంది.
*దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏర్పాటవుతున్న ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, 2018 కేలండర్ ఏడాదిలో రికార్డు స్ధాయిలో రూ.3,600 కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది.
రైతురుణ మాఫీ వలన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం-ఆర్‌బీఐ-వాణిజ్య-05/09
Related tags :