‘‘కరోనా మహమ్మారిని ఓడించడానికి స్ట్రెంత్ (శరీరంలో రోగనిరోధక శక్తి, గుండెధైర్యం), హ్యూమర్ (హాస్య చతురత)… రెండూ అవసరం’’ హిందీ నటి రిచా చద్దా అంటున్నారు. వర్ణవివక్ష, కరోనా-లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తుంటారు. అదే సమయంలో నవ్వించే సంగతులు పోస్ట్ చేస్తుంటారు. తనకు నచ్చినవీ, తాను ఎంజాయ్ చేసినవీ షేర్ చేస్తుంటానంటారామె. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల గురించి రిచా చద్దా మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది సర్వైవల్ కావాడానికి ఏదో మార్గం అన్వేషించాలి. ఇళ్లకు వెళ్లిన వలస కార్మికులు ఉపాధి కోసం వెనక్కివస్తే… ఎటువంటి సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది? ఒకవేళ రాకపోతే… కంపెనీలు మనుగడ సాధించగలవా? నాకు తెలీదు. ఎకానమీ, ఆరోగ్య వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే… నేనూ వలసపక్షినే. కాకపోతే ఇతర వలస కార్మికుల కన్నా మంచి స్థితిలో ఉన్నాను. అలాగని, వారి సంగతులు తెలుసుకోకూడదా?’’ అని ప్రశ్నించారు. నిత్యావసరాలకు వెళ్లినప్పుడు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న ప్రజలను చూశాననీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించకపోవడం ప్రాణాంతకమని ఆమె హెచ్చరిస్తున్నారు.
ధైర్యం…హాస్యం…మాయం
Related tags :