* దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలుదేశ రాజధాని దిల్లీలో వరుణుడు విజృంభిస్తున్నాడు.ఆదివారం తెల్లవారుజాము నుంచి దిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.గంటకు 20నుంచి 50కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.దిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
* ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానా చేసిన ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. సుల్తానా ఈ నెల 1న తమ ఆస్పత్రిలో చేరారని పేర్కొంది. చేరినప్పటి నుంచి ఆమె వైద్య సిబ్బందితో గొడవ పడ్డారనీ.. కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపింది. దీంతో ఆమెకు వైద్య సేవలందించేందుకు నర్సింగ్ సిబ్బంది నిరాకరించారని వెల్లడించింది. అయినా సుల్తానాకు కొవిడ్ చికిత్స కోసం సహకరించామని తెలిపింది. ఆమె ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు యాజమాన్యం తెలిపింది.
* వైకాపా ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని, రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది వైకాపానన్నారు. 13 నెలలైనా వైఎస్ వివేకానంద హంతకులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. తెదేపా నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని, తెదేపాపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్ల స్వాధీనంపై తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో వైకాపా వేధింపులపై రేపు నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇళ్ల స్థలాల్లో వైకాపా అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
* భాగ్యనగరంలో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు ‘అసెట్ ప్రొటెక్షన్ సెల్’ టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 0099ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నంబర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
* వైకాపా ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
* ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వారివురు చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. వీరివురి సమావేశానికి సబంధించిన ఫొటోను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
* ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 20,256 శాంపిల్స్ పరీక్షించగా.. 961 స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా ఈ రోజు 998 పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి.
* కరోనా మహమ్మారితో విలవిలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి భారీ వర్షాల రూపంలో మరో విపత్తు ఏర్పడింది. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)అంచనా వేసింది.
* కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ), హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్తో చేస్తున్న ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు ఎంతమేర ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు గత కొంతకాలంగా డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతున్న విషయం తెలిసిందే.
* ప్రపంచ సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారికి చైనానే పూర్తి జవాబుదారీగా ఉండాలని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. చైనా రహస్య, వంచన విధానాలే కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడానికి కారణమయ్యాయని ఆ దేశంపై విరుచుకుపడ్డారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్లో 8మంది పోలీసులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు స్థానిక పోలీసులే సాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
* వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ప్రియమణి కథానాయిక. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఇప్పటికే మాస్‌లుక్‌లో ఉన్న వెంకటేశ్ స్టిల్‌ను విడుదల చేయగా, ఇటీవల ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్‌ను కూడా విడుదల చేశారు. వెంకటేశ్ ఇందులో ఇద్దరు కొడుకుల తండ్రి కనిపించనున్నారు. పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం కనిపించనున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’లో కార్తీక్ లుక్‌ను విడుదల చేశారు.
* ప్రముఖ శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ ఆదివారం అరెస్టయ్యాడు. ఈ రోజు ఉదయం ఓ సైక్లిస్టును తన కారుతో ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కారుతో సహా మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.