డా.వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మ స్వయంగా రచించిన “నాలో…నాతో…” వైఎస్సార్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…దివంగత మహానేత ఒక గొప్ప వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా మహా నేతగా ప్రపంచానికి తెలుసు. నాన్నతో కలిసి అమ్మ చేసిన సుదీర్ఘ ప్రయాణంలో…ఒక భర్తగా, పిల్లలకు తండ్రిగా, ప్రజలందరికీ అండదండలు అందించే మహానేతగా ప్రేమను పంచిన వ్యక్తిగా ఆమెకు తెలుసు. ఆమెకు తెలిసిన డాక్టర్ వైయస్సార్ ని ప్రజలందరికీ తెలియజేయాలని అమ్మ రాసిన మంచి పుస్తకం అని పేర్కొన్నారు.
అమ్మ రాసిన మంచి పుస్తకం
Related tags :