రైతు భరోసా కొత్త పథకం కాదన్న చంద్రబాబు. అన్నదాత సుఖీభవ రద్దు చేసి రైతు భరోసా తెచ్చారని వెల్లడి. రైతు భరోసాతో ఐదేళ్లలో వచ్చేది రూ.37,500 అని వివరణ. వైసీపీ సర్కారు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతు భరోసా పథకం తీసుకువచ్చారని వెల్లడించారు. రైతు భరోసాతో ఐదేళ్లలో రైతులకు వచ్చేది రూ.37,500 మాత్రమేనని, తమ ప్రభుత్వం ఉంటే ఒక్కో రైతుకు రూ.లక్ష 20 వేలు వచ్చేవని వివరించారు. అంతకుముందు ఆయన మాజీ మంత్రి బండారు అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లు ఇవ్వాలని కోరడమే టీడీపీ నేతలు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతుభరోసాపై చంద్రబాబు స్వోత్కర్ష
Related tags :