కావలసిన పదార్థాలు :
జొన్న పిండితో చేసిన సేమ్యా : 150 గ్రా.
బెల్లం : 100 గ్రా.
పాలు : ఒక కప్పు
యాలకుల పొడి : 10 గ్రా.
నెయ్యి : 10 గ్రా.
నీళ్లు : 2 1/2 కప్పులు
తయారీ విధానం :
జొన్న సేమ్యాను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. వేయించిన ఆ సేమ్యాను 2 1/2కప్పుల వేడి నీటిలో ఉడికించుకోవాలి. పాలను కాచి, దానిలో యాలకుల పొడి, వేయించిన సేమ్యాను 10 నిమిషాల పాటు ఉడికించాలి. తురిమిన బెల్లాన్ని పై మిశ్రమానికి కలుపుకోవాలి. వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించుకోవాలి.
పోషకాలు (100గ్రా.లో) :
ప్రొటీన్స్ : 4.98 గ్రా.
కొవ్వు : 4.9 గ్రా.
పీచు పదార్థం : 1.5 గ్రా.
పిండి పదార్థం : 27.2 గ్రా.
శక్తి : 285.5 కి.క్యాలరీస్
క్యాల్షియం : 68.3 మి.గ్రా.
ఇనుము : 1.5 మి.గ్రా