DailyDose

వైకాపా కార్యకర్తపై హత్యాయత్నం-నేరవార్తలు

వైకాపా కార్యకర్తపై హత్యాయత్నం-నేరవార్తలు

* పెడన…వై ఎస్ ఆర్ సి పి కార్యకర్త బాజీపై హత్యాయత్నం.స్థానిక 16 వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్దుల్ బాజీ పై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నంస్థానిక 12 వార్డు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు బాజీ ఇంట్లోకి చొరబడి కత్తులు రాడ్లతో దాడిఈ ఘటనలో బాజీ తలకు బలమైన గాయంకుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తనను హత్య చేయటానికి పదిమంది మంది వరకు తన ఇంటి పైకి దాడి చేశారని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు అడ్డు రావడంతో బతికిపోయా అని చెబుతున్న బాజీ

* ముంబయిలోని ఓ షాపింగ్ సెంటర్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని… మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోన్నారు.

* అరుణాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందటంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.

* వైసీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో  ఏ-1, ఏ-2నిందితులు ఈరోజు మచిలీపట్నం కోర్టుకు హాజరయ్యారు. మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా…అందుకు న్యాయస్థానం అనుమతించింది.

* నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో 22 మంది మరణించారు. నేపాల్ దేశంలోని కస్కీ జిల్లాలో భారీవర్షాల వల్ల ముగ్గురు పిల్లలతోసహా ఏడుగురు మరణించారు.

* నెల్లూరులో విషాదం…సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్య. నెల్లూరు భక్తవత్సల నగర్ లో రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య….ఉరేసుకునే ఫొటోలను చిత్రీకరించి చాటింగ్ చేస్తు ముగ్గురు యువకులకు వాట్సాప్ లో పంపిన రమ్య.

* శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల దాడి. శేషాచలంలో టాస్క్‌పోర్స్ పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించారు.

* కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న రూ. 80 వేలు విలువగల నిషేధిత గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలను ఉరవకొండ పోలీసులు పట్టుకున్నారు.