Editorials

చైనాకు మాకు బాగా చెడింది

Trump Accepts China And USA Are In Hot Waters With Each Other

కరోనా కట్టడిలో చైనా విఫలమైన కారణంగా అమెరికా చైనా బంధం బాగా చెడిందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలోని రెండో దశ కార్యరూపం దాల్చదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘చైనాతో బంధం బాగా చెడిపోయింది. వాణిజ్యం ఒప్పందం గురించి ప్రస్తుతం నేను ఆలోచించట్లేదు’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. గత ఏడాది చైనాతో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల యుద్ధానికి ఇది ముగింపని కూడా అనేక మంది భావించారు. అయితే ఈ పురోగతి అంతా కరోనా కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. కరోనా తొలినాళ్లలో చైనా సరైన రీతిలో స్పందించలేదని ట్రంప్ ఆరోపణలు గుప్పించడం ప్రారంభించారు. ఈ సంక్షోభానికి బాధ్యత వహించాల్సింది చైనాయే అని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.