* గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామం లొ హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి బాలల పరిస్థితి విషమం .మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ కు తరలింపు .వీరిలో చౌ టపల్లి అరవింద్ (8)ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం.
* అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతఒ పెట్రోల్ బంక్ వద్ద ఆటో ని డి కొన్న లారీ నలుగురు మృతి.
* విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు.విశాలాక్షి నగర్లో విజయ్‌కుమార్ అనే యువకుడు వార్డు సచివాలయ భవనం మూడో అంతస్తు పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అతని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుని స్నేహితులను విచారిస్తున్నారు.
* నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి శవాన్ని ఆటోలో తీసుకెళ్లిన ఘటనపై విచారణ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. సిబ్బందిపై ఒత్తిడి చేసి మృతుడి బంధువులు ఆటోలో తీసుకెళ్లినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
* గుత్తి పట్టణంలోని పలు కాలనీలలోనీ 4 ఇండ్లలో చోరీ. సుమారు 1 లక్ష రూపాయల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు.