* బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ శనివారం సాయంత్రం కోవిడ్ పాజిటివ్ కారణంగా హాస్పిటల్‌లోజాయిన్ అయిన సంగతి తెలిసిందే. జయబాదురి, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య సహా ఇతర కుటుంబ సభ్యులకు నెగటివ్ అనే అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు తాజా కరోనా టెస్టుల్లో అమితాబ్ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారెవరో కాదు.. ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య. ఇప్పుడు వీరిద్దరూ కూడా నానావతి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారట. మిగిలిన కుటుంబ సభ్యులు జయబాదురి, ఆగస్య నందా, నవ్య లకు నెగటివ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినట్లు సమాచారం.
* తెనాలి నియోజకవర్గంలో ఆదివారం కొత్తగా తొమ్మిది కరోనా కేసులుచెంచుపేట-1,కొత్తపేట-4,కట్టేవరం-1,కొల్లిపర మండలం దావులూరి పాలెం-3,దీనితో నియోజకవర్గంలో కేసులు సంఖ్య 185 కి చేరింది.
* మహారాష్ర్టలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది.కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.తాజాగా మహారాష్ర్ట గవర్నర్ నివాసానికి కరోనా తాకింది.రాజ్ భవన్ లో పని చేసే ఉద్యోగుల్లో 16 మందికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.మొత్తం 100 మందికి కొవిడ్ టెస్టులు చేయగా.. అందులో 55 మంది ఫలితాలు రాగా, 14 మందికి కరోనా పాజిటివ్ చ్చింది.దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.త్వరలోనే గవర్నర్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.
* భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడు, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది. ఒకేరోజు 19 మంది చనిపోవడం అనేది ఆందోళన కలగజేసే విషయం…గడచిన 24 గంటల్లో 17,624 మంది నమూనాలు పరీక్షించగా 1933 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.