కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు నాట్స్ టెంపాబే విభాగం నిత్యావసరాలను, ఆహారపదార్థాలను అందించింది. అవేర్నెస్ యూఎస్ఏతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది. టెంపాబేలోని బైబిల్ ట్రూత్ మినిస్టరీస్ అకాడమీ ప్యాలెస్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 బ్యాగులను పేదలకు అందించారు. నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, ప్రతినిధులు ప్రశాంత్ పిన్నమనేని, రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, సుమంత్ రామినేని, రమా కామిశెట్టి, టోనీ, టుట, రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలయ్, సోమంచి కుటుంబం, డాక్టర్ పూర్ణ, తార బిక్కసాని, డాక్టర్ సుదర్శన్, సుధీర్ మిక్కిలినేని, సుమంత్ రామినేని, ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.
పేద అమెరికా కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాల పంపిణీ
Related tags :