Sports

గంగూలీని రెచ్చగొట్టకూడదు

గంగూలీని రెచ్చగొట్టకూడదు

టీమ్‌ఇండియాను 2000ల్లో ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు సౌరవ్‌ గంగూలీ ఎంతో శ్రమించాడని దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌స్మిత్‌ అన్నాడు. ఎవ్వరైనా సరే అనవసరంగా రెచ్చగొడితే బదులిచ్చే తీరు అద్భుతమని ప్రశంసించాడు. ‘దాదాను కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుందని మనందరికీ తెలిసిందే’ అని స్మిత్‌ అన్నాడు. ‘ప్రస్తుతం నేను ఎక్కువ సమయం దాదాతో గడుపుతున్నా. ప్రత్యేకించి పరిపాలనకు సంబంధించి చాలా ఎక్కువగా చర్చిస్తున్నాను. అతనెప్పుడూ ప్రశాంతంగా మాట్లాడాలని అనిపించే విధంగా ఉంటాడు. మంచి సంభాషణలను ఇష్టపడతాడు’ అని పేర్కొన్నాడు.