Movies

వేశ్యగా…

Tabu as prostitute in next movie - Details inside

ఇషాన్‌ ఖట్టర్‌, టబు ప్రధాన పాత్రల్లో విక్రం సేత్‌ నవల ఆధారంగా రూపొందుతున్న మినీ సిరీస్‌ ‘ఏ సూటబుల్‌ బాయ్‌’. మీరా నాయర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ కపూర్‌, తాన్య మణిక్తల, రాశిక దుగల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇందులో టబు వేశ్యగా నటిస్తున్నారు. ట్రైలర్‌లో ఇషాన్‌ ఖట్టర్‌, టబుల మధ్య జరిగే శృంగార సన్నివేశాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హీరో ఒక వేశ్య అందానికి ఎలా ఫిదా అయ్యాడనే కథాంశంగా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇది లక్నో, మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. జులై 26న బీబీసీ వన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.