కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా ముంబయి నానావతి ఆసుప్రతిలో చేరిన అమితాబ్, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ మరో వారం పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. వీరిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, అయితే మరో వారం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. అభిషేక్ భార్య ఐశ్వర్యరారు, కూతురు ఆద్యా కూడా కరోనా పాజిటివ్‌గా మారడంతో వారు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన శనివారం నాటి నుండి అమితాబ్, అభిషేక్ ఇద్దరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడుతూనే ఉన్నారు.
ఇంకో వారం
Related tags :