Politics

కరోనా చికిత్సపై నమ్మకాలు నిల్

కరోనా చికిత్సపై నమ్మకాలు నిల్

కరోనా చికిత్సపై మంత్రులకే నమ్మకం లేదు: చంద్రబాబు

పద్మనాభస్వామి ఆలయంపై సుప్రీంకోర్టు తీర్పు మైలురాయిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.

ట్రస్టుల నిర్వహణలో సంప్రదాయాల పవిత్రతను న్యాయస్థానం రక్షించిందన్నారు.

సుప్రీం తీర్పును ఏపీ ప్రభుత్వం గ్రహించాలని సూచించారు.

సింహాచలం, మాన్సాస్‌ ట్రస్టుల్లో జోక్యం మానేయాలని పేర్కొన్నారు.

కుటుంబం నడిపే ట్రస్టుల్లో జోక్యం సరికాదని హితవు పలికారు.

విశాఖలో 15 రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. 

మూడు కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు.

బాధితులను ఆదుకోకుండా కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. 

కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో వారాల తరబడి జాప్యం తగదన్నారు.

రాష్ట్రంలో కరోనా చికిత్సపై మంత్రులకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.

ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరారని తెలిపారు.