మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో పవిత్రోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు శాస్త్రపరంగా జరగనున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలిరోజు గోపూజతో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి, ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే పవిత్రోత్సవాలు ఈ ఏడాది covid 19 కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి అతికొద్ది మంది భక్తుల నడుమ శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహణము, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, ఋత్విగ్వరణ, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్ఠానం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పములు. శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మధు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభమైన మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాలు
Related tags :