Movies

మీకు తెలియాల్సిన పనిలేదు

మీకు తెలియాల్సిన పనిలేదు

హీరోయిన్లలో నయనతార అనుసరించే మార్గం ప్రత్యేకం. సినిమాలో నటించి తన పని పూర్తి చేసుకొని వెళ్లిపోతారే తప్ప ఆ సినిమా ప్రమోషన్స్‌కు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. ఒక సినిమా ఒప్పుకొనేముందు దర్శకనిర్మాతలకు ఈ విషయం స్పష్టంగా చెప్పి వాళ్లు ఓకే అన్న తర్వాతే ఆ సినిమా సైన్‌ చేస్తారు. పదేళ్ల తర్వాత ఇటీవలే నయనతార ఓ పత్రికకు ఇంటర్య్యూ ఇచ్చారు. తను ఇంటర్య్వూలు ఎందుకు ఇవ్వనో అందులో చాలా స్పష్టంగా తెలిపారు. ‘అవును. పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం కానీ నాకు ఇష్టం ఉండదు. నేను ఏం చేస్తున్నానో, ఏమీ ఆలోచిస్తున్నాననో అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అదీ కాకుండా ప్రారంభంలో నేను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో నా మాటల్ని వక్రీకరించారు. నేను చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా ప్రచారం చేశారు. దాని వల్ల నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది సినిమాల్లో నటించడం నా వృత్తి. వాటి గురించి నేను మాట్లాడడం కాదు.. ఆ పాత్రలే మాట్లాడాలి. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం కోసమే మీడియాకు దూరంగా ఉంటాను’ అని వివరించారు నయనతార.