మెగాస్టార్ చిరంజీవి నటజీవితంలో ‘మగ మహారాజు’ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఆర్టిస్ట్‌గా ఆయన్ని మరో రెండు మెట్లు ఎక్కించిన చిత్రమది. విజయబాపినీడు ఆ చిత్రానికి దర్శకుడు. సుహాసిని కథానాయిక. ఈ చిత్రంలో ‘నెలలు నిండినా కనక మానదు’ పాటను చెన్నైలోని వి.జి.పి. లో చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి, సుహాసిని స్పాట్‌లో ఉన్నారు. ఈ పాటలో ఓ చోట సుహాసినిని చిరంజీవి ఎత్తుకొంటారు. మరో చోట కూడా అలాంటి సందర్భరమే రావడంతో ‘ఏం .. ఎప్పుడూ హీరోయిన్‌ను హీరో ఎత్తుకోవడమేనా.. వెరైటీగా ఈసారి నేను మిమ్మల్ని ఎత్తుకొంటాను’ అన్నారు. చిరంజీవి భయం నటిస్తూ.. ‘నిజంగా ఎత్తుకొంటావా.. లేక నన్ను కింద పడెయ్యాలనుకొంటున్నావా’ అన్నారు. ‘మీరేం భయపడకండి.. కింద పడెయ్యను.. చూడండి’ అని అమాంతం చిరంజీవిని ఎత్తుకొన్నారు సుహాసిని. వెంటనే ఆ షాట్‌ను తన కెమెరాలో బంధించారు ఛాయాగ్రాహకుడు లోక్‌సింగ్. షాట్ పూర్తవగానే చిరంజీవిని కిందకు దించేసి..‘ పెద్ద బరువేం లేరు మీరు.. తేలికగానే ఎత్తుకోవచ్చు’ అన్నారు సుహాసిని. ‘అవును.. నువ్వు బలవంతురాలివే’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు చిరంజీవి. పక్కనే ఉన్న స్టిల్ ఫొటోగ్రాఫర్ నారాయణరావును పిలిచి ‘ వెరైటీగా ఉంటుంది.. స్టిల్ తియ్యి’ అని చెప్పారు. స్టిల్ కోసం మరోసారి చిరంజీవిని ఎత్తుకొన్నారు సుహాసిని.
బలప్రదర్శనకు దిగిన సుహాసిని
Related tags :