* 43వ వార్షిక సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంతో జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు తెలిపింది. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు, ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను వివరించారు.
* దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 1,34,885 కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది.వేగనార్, బాలినో మోడళ్ల ఫ్యూయల్ పంప్‌లలో సమస్యలు తలెత్తొచ్చని గుర్తించి.. వాటిని సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.రీకాల్ జాబితాలోని కార్లు ఇవే2018 నవంబర్ 15 నుంచి 2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వేగనార్(1లీటర్ ఇంజిన్) కార్లు, 2019 జనవరి 8 నుంచి 2019 నవంబర్ 4 మధ్య తయారైన బాలినో(పెట్రోల్ వేరియంట్లు) మోడళ్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది మారుతీ.56,663 వేగనార్ కార్లు, 78,222 బాలినో యూనిట్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి.రీకాల్ విషయంపై డీలర్లే నేరుగా వినియోగదారులను సంప్రదించనున్నట్లు మారుతీ వెల్లడించింది.
* జియోలో గూగుల్ భారీ పెట్టుబడి.జియో ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చిన పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదన్నారు ముకేశ్.భవిష్యత్ ప్రణాళికల్లో గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కమ్ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వాములుగా ఉండనున్నట్లు వెల్లడించారు.గూగుల్ కన్నా ముందు ఫేస్బుక్ సహా మొత్తం 12 కంపెనీలు 13 దఫాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టాయి.25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.ఈ మొత్తం పెట్టుబడుల్లో ఫేస్బుక్ అతిపెద్ద మైనారిటీ వాటాదారుల్లో మొదటి స్థానంలో ఉండగా.. గూగుల్ రెండో స్థానాన్ని పొందనుంది.