సౌందర్య పరిచయం అక్కరలేని పేరు. అందానికి అసలైన నిర్వచనం లా ఉండే ఈ జాబిలమ్మ అసభ్య వస్త్ర ధారణకి దూరంగా ఉండే ఈ అందాల భామ సినీ రంగం లో సావిత్రి అంతటి నటి అనిపించుకుని, పుట్టింది కర్ణాటక లో అయినా అచ్చ తెలుగు ఆడపడుచులా ఎవరికి వారికి మా ఇంటి పడుచు అనిపించిన సౌందర్య స్వర్గ ద్వార తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయింది.. అందంలో పుత్తడి బొమ్మ ఈ సౌమ్య. కన్నడ రంగాన్ని వీడి తెలుగింట అడుగు పెట్టి తిరుగులేని తార గా 10 సంవత్సరాలు ఏకధాటిగా తనకి తనే సాటిగా పోటి లేకుండా ఏలిన నటీ మణి. నిజంగా మణి పూసే ఈ కుందనపు బొమ్మ. సావిత్రి మళ్ళీ పుట్టింది అన్నట్టుగా తనని ఆరాదించే వారు అభిమానులు . నిండైన చీర కట్టుతో తెలుగింటి ఆడపడుచు అనిపించింది. ఏ పాత్ర లో అయిన తనని తను మలుచుకుని ఆ పాత్రకే అందం తెచ్చిన ఏకైక నటీమణి సౌందర్య. చాలా కొద్ది సమయంలో నటనలో ఆకాశమంత ఎత్తు ఎదిగి ఆ నింగి కే చేరింది ఈ సినీ తార… తను నవ్వితే మల్లెలు విరబూసినంత స్వచ్చంగా ఉండేది. సౌందర్యమంత రాసి పోస్తే అది సౌందర్య అవుతుంది. సినీ జగత్తులో తను పరిచిన వెన్నెల చాలనుకుందేమో సినీ ప్రపంచాన్ని, అభిమానులు ని వీడి తన దారిన తను వెళ్ళిపోయింది. సౌందర్య కి జయంతి నివాళులర్పిస్తూ..
అద్భుత సౌందర్యం ఆమెకే సొంతం
Related tags :