* జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఎస్సీ యువకుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఘోరంగా ఉంది.పోలీస్ స్టేషన్లోనే యువకుడికి పోలీసులు శిరోముండనం చేసి చితకబాదారు.తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్లోనే ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు పోలీసులు.యువకుడిని కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు.ఇసుక లారీలను ఆపినందుకు దాడిచేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక వైకాపా నాయకుడు వచ్చాడు.అతడి అనుచరుడి ఫిర్యాదుతో వరప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీతానగరం పీఎస్‌కు తీసుకెళ్లారు.పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన పోలీసులు… తీవ్రగాయలయ్యేలా కొట్టారు.అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు.వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్.ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై డీఎస్పీ కేసు నమోదు చేశారు.
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై పులివెందులలో మూడు రోజు సీబీఐ విచారణ కొనసాగనుంది.నేడు పులివెందులలో హతుడు వైఎస్ వివేకా కుటుంబసభ్యులను సీబీఐ బృందం మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది.
* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝారసంగం ఏ ఎస్ ఐ చందర్ నాయక్ యువకుడిని చితకబాది గాయపర్చిన సంఘటన మంగళవారం నాడు ఝారసంగం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక మండల కార్యాలయంలో గాయపడిన మహేష్ సతీమణి విధులు నిర్వహిస్తున్న తన సతిమణిని కార్యాలయంలో వదిలి తిరుగు ప్రయాణంలో బోపన్ పల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే దళిత యువకుడిని మొకానికి మాస్క్ సరిగా పెట్టుకోలేదని ఝారసంగం ఏ ఏస్ ఐ చందర్ నాయక్ లాఠీతో మహేష్ అనే యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఈ విషయం కొందరు వ్యక్తులు పోలీస్ లు ప్రజలకు చెప్పేది పోయి ఇలా కొట్టడం ఏంటి అని నిలదీసుతున్నారు. సీఎం గారు ఫ్రెండ్లి పోలీస్ అంటారు. ఫ్రెండ్లి పోలీస్ ఈవిధంగా ప్రవర్తిస్తారు అన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* బాలికతో వ్యభిచారం చేయించిన ముఠాకావలికి చెందిన బాలికను వదినే వ్యభిచార ముఠాకు విక్రయించిన వైనంకందుకూరు – సింగరాయకొండ మధ్యలో బాలికను నిర్బంధించిన ముఠాసమాచారం అందుకుని బాలికను రక్షించిన పోలీసులుఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనవ్యభిచార ముఠా కోసం గాలిస్తున్న పోలీసులు.
* కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద లారీలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం.విశాఖపట్నం నుండి తెలంగాణా కు అక్రమం గా లారీలో తరలిస్తున్న గంజాయి ని పట్టుకున్న పోలీసులులారీలో తరలిస్తున్న 514 కేజీల గంజాయిని , లారీ ని సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు.లారీని సీజ్ చేసి స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.