* వ్యాక్సిన్ రాబోతోందన్న వార్తలతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు511 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ6 శాతానికి పైగా లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాబోతోందనే వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ ఉదయం నుంచి కూడా సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 511 పాయింట్లు లాభపడి 37,930కి పెరిగింది. నిఫ్టీ 140 పాయింట్లు పుంజుకుని 11,162కి ఎగబాకింది.
* సగానికిపైగా ప్రైవేటీకరించే ఆలోచనలో కేంద్రంన్యూఢిల్లీ/ముంబై: ప్రస్తుతం దేశంలోని డజను ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ)ల్లో సగానికిపైగా ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా పీఎ్‌సబీల సంఖ్యను భవిష్యత్‌లో 4 లేదా 5కు తగ్గించాలనుకుంటున్నట్ల్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత అర డజను బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), యూకో బ్యాంక్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.పీఎ్‌సబీల్లో ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతోందని ఈ మధ్య నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ వెల్లడించారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ కంపెనీల (పీఎ్‌సయూ)ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. వ్యూహాత్మక రంగాల్లో గరిష్ఠంగా 4 పీఎ్‌సయూలనే కొనసాగిస్తామని, మిగతా వాటిని ప్రైవేటుపరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యూహాత్మకేతర రంగాల్లో అన్ని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించనున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకింగ్‌ను వ్యూహాత్మక రంగాల జాబితాలో చేర్చనున్నట్లు సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకేతర రంగాలను గుర్తించే పనిలో ఉంది.
* ఒకవైపు కరోనా భయం.. మరో వైపు డీజిల్ బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు.దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి.పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు కంపెనీలు, డీజిల్ ధరను 12 పైసలు పెంచాయి.దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 81.64కు చేరింది.పెట్రో ధరలు యధాతథంగా ఉండటంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.80.43గా ఉన్నది.అంటే పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.1.21 ఎక్కువ.