Health

హైదరాబాద్ మేయర్‌కు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

హైదరాబాద్ మేయర్‌కు కరోనా పాజిటివ్-TNI బులెటిన్

* హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

* కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో కరోనా కలకలంఒకొక్కటిగా బయటపడుతున్న పాజిటీవ్ కేసులుగత రెండు రోజుల క్రితం కలెక్టరేట్ ఉద్యోగులకుకరోనా నిర్ధారణ పరీక్షలుకరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సుమారు 100 మంది ఉద్యోగులుఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాలుసుమారు 15 మందికి పైబడి పాజిటీవ్ రిపోర్ట్దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న కలెక్టరేట్ ఉద్యోగులుభీతిల్లుతున్న సహచర ఉద్యోగులు, సిబ్బంది

* కరోనా పాజిటివ్ బాధితుల ఆర్తనాదాలు…విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేపాక క్వారంటైన్ లో ఉన్న పాజిటివ్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.వారం రోజుల నుండి డాక్టర్లు, నర్సులు, మందులు, సరైన శుభ్రత, మంచి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మాత్రం దానికి కోరం టైం లో ఎందుకు ఉంచారని అధికారులను వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నారు.వీరందరికీ సరైన చికిత్స అందించకపోతే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధికారులు స్పందించి న్యాయం చేస్తారని కోరుతున్నారు.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13,85,552కు చేరింది. ఇక దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 700 మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే మరో 705 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 32,063కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో 8,85,577 మంది కోలుకోగా మరో 4,67,882 క్రీయాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 63శాతం ఉండగా మరణాల రేటు 2.35శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 2లక్షలు దాటింది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడోస్థానంలో ఉండగా మరణాల్లో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

* 5వ రోజు కొనసాగుతున్న టిడిపి ఆందోళనలు.కరోనా ‘‘ఫ్రంట్ లైన్ వారియర్లకు’’ సంఘీభావంగా నేడు టిడిపి నిరాహార దీక్షలు‘‘కరోనా సమస్యల పరిష్కారం కోసం వైసిపి ప్రభుత్వంపై సమరభేరి’’ టిడిపి వారం రోజులు ఆందోళనలు.5వరోజైన ఆదివారం టిడిపి నాయకుల నిరాహార దీక్షలుఫ్రంట్ లైన్ వారియర్ల సేవలకు సంఘీభావంగా టిడిపి నిరాహార దీక్షలుకోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే టిడిపి దీక్షలు.ఆదివారం కూడా కొనసాగుతున్న టిడిపి దీక్షలురాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షలలో పాల్గొన్న టిడిపి నాయకులు, కార్యకర్తలుదీక్షలలో ప్లకార్డులు ప్రదర్శించిన టిడిపి నాయకులు..కరోనా పోరాట యోధుల త్యాగాలు నిరుపమానంఫ్రంట్ లైన్ వారియర్లకు తెలుగుదేశం సంఘీభావం

* నగరంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కఠినంగా లాక్ డౌన్…రేపటి నుండి కడప నగరంలో 10 గంటల లోపు దుకాణాలు తీరించేందుకు అనుమతి…10 గంటల తర్వాత దుకాణాలు మూసి వేయాలని సూచన…10 గంటల తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయట తిరిగేందుకు అనుమతి లేదన్న పోలీసులు…దయచేసి కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన డిఎస్పీ సూర్యనారాయణ…నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ సూర్యనారాయణ హెచ్చరిక.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా తమ దేశంలో ఒక్క కొవిడ్‌-19 కేసు నమోదు కాలేదని ప్రకటిస్తూ వస్తోన్న ఉత్తరకొరియాలో తొలి కరోనా అనుమానాస్పద కేసు నమోదైంది.కైసోంగ్‌ నగరంలోని ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నాడని ఉత్తర కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది.ఈ ఘటనతో కైసోంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు ఆ దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.దేశంలోకి వైరస్​ వస్తే క్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించారు.వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర పరిస్థితి విధించారు.చాలా ఏళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి సరిహద్దును అక్రమంగా దాటి మళ్లీ వచ్చాడని.. అతడికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు అధికారులు.ఈ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయితే ఉత్తర కొరియాలో అధికారికంగా తొలి కరోనా కేసు నమోదవుతుంది.