చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడిని తీసుకు వెళ్లడం బాధాకరమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.తన సొంతూళ్లో జరిగిన ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని ఆయన అన్నారు.సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించిన వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించారని.. అవి అవసరానికి ఉపయోగపడలేదన్నారు.తనను క్షమించాలని జనాన్ని కోరారు. ప్రారంభించిన అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.ఇటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని మీడియాకు తెలిపారు.
నేను సిగ్గుతో తలదించుకుని క్షమాపణలు చెప్తున్నాను
Related tags :