DailyDose

సీబీఐ విచారణకు హాజరయిన వివేకా కుమార్తె-నేరవార్తలు

సీబీఐ విచారణకు హాజరయిన వివేకా కుమార్తె-నేరవార్తలు

* మాజీమంత్రి వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ…కడపలో సీబీఐ విచారణకు హాజరైన వివేకా కుమార్తె సునీత.

* పాకిస్థాన్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీస్ క‌మాండోలు ప్రాణాలు కోల్పోయారు.మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ దుండగులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు.పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.దుండ‌గుల‌ కాల్పుల్లో ఐదుగురు పోలీస్ క‌మాండోలు మృతిచెందగా మరో పోలీస్‌ గాయపడిన‌ట్లు జియో న్యూస్‌ తెలిపింది. 

* తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో భార్య అనారోగ్యంతో ఉన్న భర్త కాపురానికి పంపాలంటూ అత్త,మామా,భార్య, బావమర్ది పై రాడ్ తో దాడి నలుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు.

* ఏపీ హైకోర్ట్ లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విశాఖ డాక్టర్ నమ్రత..విశాఖలో పిల్లల అక్రమ రవాణా కేసులో ఏ1గా ఉన్న డా.నమ్రత. విశాఖ యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నమ్రత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలను గుర్తించిన పోలీసులు.

* చీరాలలో ఎస్సై విజయ్ కుమార్ ను సస్పెండ్ చేసిన ఎస్పీ సిద్దార్ద కౌశిల్. మాస్కు పెట్టుకోవేదని విచక్షణారహితంగా దళిత యువకుడ్ని కొట్టడంతో మృతి చెందినట్లు ఎస్ఐపై ఆరోపణలు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ.