నాన్‌వెజ్ ప్రియులు తోటకూరకు దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి తోటకూర చేసినా ఎప్పుడూ తోటకూరే అంటూ ముఖం ముడుచుకొని తింటుంటారు. ఆరోగ్యాన్నిచ్చే ఏవైనా అందరికీ గొరకాదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. రెండు రోజులకు ఒకసారి తోటకూర తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో అందుతాయి. మరి అది తినని వారు ఏవేం కోల్పోతారో ఇప్పుడు తెలుసుకుందాం.
* తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
* ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
* డైట్ ఫాలో అయ్యేవాళ్ల లిస్టులో తోటకూర తప్పనిసరిగా ఉంటుంది. తోటకూర తినడం వల్ల బరువు తగ్గుతారు.
* ఇందులో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. కొవ్వును తగ్గించడానికి తోటకూర సాయపడుతుంది.
* విటమిన్ ఎ, సి, డి, ఈ, కే, విటమిన్ బి12, బి6 వంటి పోషకాలన్నీ తోటకూరలో ఉంటాయి.
* ఆకుకూరల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది రక్తనాళాల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
* తోటకూర ఎక్కువ తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. తోటకూరను ఉడికించుకొని తింటే ప్రొటీన్లు మిస్ అవ్వకుండా శరీరానికి అందుతాయి.
* కరోనా టైంలో తోటకూర తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటును అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.
* సీజన్లు మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను తోటకూర అడ్డుకుంటుంది.
* తోటకూర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కురులకు కూడా ఉపయోగపడుతుంది. తోటకూర ఆకులను మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
కరోనా జలుబు దగ్గును తగ్గించే తోటకూర
Related tags :